సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో అమ్మ ప్రేమ ఆదరణ అనే ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే గత రాత్రి విజయవాడకు వెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ ను ప్రారంభించారు తేజ్. అక్కడే ఉన్న వృద్ధులతో కొంత సమయం కూడా గడిపారు.
అంతేకాకుండా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహణకు ఏడాది పాటు బాధ్యత కూడా తీసుకుంటానని హామీ ఇచ్చారు. గతేడాది విజయవాడకు చెందిన ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో తమ పరిస్థితి తెలియజేస్తూ సాయం చేయాలని కోరారు. అది తెలిసిన సాయి ధరమ్ తేజ్ నివాస గృహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవంలో పాల్గొని ఎంతో మంది వృద్ధులకు ఆసరాగా నిలిచాడు.