రాంగోపాల్ వర్మ తాజా చిత్రం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు లైన్ క్లియర్ అయింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వటంతో… రేపు విడుదల కావాలిసిన సినిమాకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని సినిమా పేరు ఉండటంతో… టైటిల్ మార్చాలని కొందరు, తనను అసభ్యంగా చిత్రీకరించారని కేఏ పాల్ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించటంతో… వర్మ టైటిల్‌ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు. టైటిల్‌తో పాటు సినిమాలో ఉన్న పలు అభ్యంతరక సన్నివేశాలను తొలగించటంతో పాటు, కొన్ని పదాలను మ్యూట్ చేశారు.
దీంతో… హైకోర్టు సూచన మేరకు మరోసారి భేటీ అయిన రివ్యూ కమిటీ సినిమాతో సంతృప్తి చెంది, సెన్సార్ క్లియర్ చేసింది.
దీంతో… డిసెంబర్ 12న విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రం విడుదలకు మార్గం సుగుమమైంది.