వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు అడ్డంకులు తెలిగినట్టే కనిపిస్తుంది. సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావటంతో ఆగిపోయిన సినిమా రిలీజ్‌ను డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నవంబర్ నెల 29 న రేలీజ్ కావాల్సిన ఈ సినిమా రేలీజ్ కొన్ని వివాదాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. రెండు వర్గాల మధ్య వివాదాలు రేపే విధంగా సినిమా ఉందని, సినిమా విడుదల నిలుపుదల చెయ్యాలని చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. మరోవైపు కేఏ పాల్ కూడా తనని కించపరుస్తూ వర్మ సినిమా తీశారని, ఆ సీన్‌లను తీసేయాలంటూ కోర్టును ఆశ్రయించారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సెన్సార్ బోర్డ్ క్లియర్ చేసేందుకు సినిమా పేరును కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ ను మార్చుతూ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు టైటిల్ గా మర్చాడు వర్మ.
ఇక ఎట్టకేలకు వర్మ సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. 2019 సార్వత్రిక ఎన్నికలు తరువాత ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.