బ్రిటన్ ప్రధాని భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన గురువారం గుజరాత్ లో పలు ప్రాంతాలను సందర్శించారు. రాష్ట్రంలో ఓ జేసీబీ ఫ్యాక్టరీని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా జేసీబీపై ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అవి వైరల్ అయ్యాయి.
జహంగీర్ పురిలో బుల్డోజర్లతో అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారులు ప్రయత్నించిన మరుసటి రోజే బ్రిటన్ ప్రధాని జేసీబీ కంపెనీనీ ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రిటన్ ప్రధాని చర్యను అజ్ఞానమైన చర్యగా అమ్నెస్టీ ఇండియా అభివర్ణించింది. ఈ సంఘటనపై బ్రిటన్ ప్రధాని మౌనం పాటించడానికి ఆ సంస్థ తప్పుపట్టింది.
దీనిపై బ్రిటన్ ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిగా ఉండకూడదన్నారు. చర్చ వేదికపైకి మానవ హక్కుల విషయాన్ని బ్రిటన్ తీసుకు రావాలని డిమాండ్ చేసింది. న్యాయం కోసం భారత్ మరో రోజు వేచిఉందని పేర్కొంది.
ఢిల్లీలోని జహంగీర్ పురిలో అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేసేందుకు అక్కడి మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీంతో ఓ వర్గానికి చెందిన వారి ఇండ్లను మాత్రమే కూల్చివేస్తున్నారంటూ జమియత్ ఉలమా ఐ హింద్ సంస్థ పిటిషన్ వేయగా స్టేటస్ కో పాటించాలని అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది.