‘ఎంఫాన్ తుఫాను ప్రస్తుతం సూపర్ సైక్లోన్‌గా కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ ఉత్తర నైరుతి దిశగా పయనిస్తుంది. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీచనున్నాయి. ఏపీలోని అన్ని పోర్టుల్లో రెండో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పారాదీప్ దక్షిణ దిశగా 570 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిగా ప్రాంతానికి దక్షిణ నైరుతి దిశగా 720 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని కెఫాపుర ప్రాంతానికి దక్షిణ నైరుతి దిశగా 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈనెల 20న మధ్యాహ్నం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య క్రమంగా బలహీనపడి తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.