ఇప్పటికే కరోనా వైరస్ తో వణికిపోతున్న బెంగాల్ ను అంఫాన్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. గంటలకు 175కి.మీ పైగా వేగంతో వీస్తున్న గాలులతో వందల సంఖ్యలో చెట్లు, స్థంబాలు నెలకొరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు బెంగాల్ లో అంఫాన్ కారణంగా 12మంది మరణించినట్లు అధికార వర్గాలు దృవీకరించాయి.
ఇక అంఫాన్ దాటికి వేలాది ఇండ్లు ద్వంసం అవుతుండగా… ఇప్పటికే 5లక్షలకు పైగా జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సహయక చర్యల్లో పాల్గొంటుంది.
తీరం దాటుతున్న సమయంలో కుండపోత వర్షంతో బెంగాల్ లోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.