తుఫాన్ ధాటికి సముద్రంలో అలలు ఉవ్వెత్తునఎగిసిపడుతున్నాయి. ఉత్తరకొస్తాకు పొంచి ఉన్న తుఫాన్ ముప్పురక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పారదీప్ కు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమై ఉన్న తుఫాన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయానికి తీవ్ర తుఫాన్ కాస్త పెనుతుఫాన్ గా మరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 140 నుండి 180 మధ్య పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా బంగాళాఖాతంమీదుగా ప్రయాణం చేస్తుంది.
ఎంఫాన్ తుపాను నేపథ్యంలో ఒరిస్సా,ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణం కేంద్రం తెలిపింది. విశాఖ,కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు వాతావరణం శాఖ జారీ చేసింది. మరో వైపు సముద్రం అల్లకల్లోలంగా ఉన్న కారణంగా మత్య్సకారులు వేటకు వెళ్లారాదంటూ హెచ్చరికలు జారీచేసింది. సముద్ర తీరప్రాంతాలలో నివసించేవారికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు తెలిపింది.