ఐఏఎస్ ఆమ్రపాలికి అరుదైన అవకాశం దక్కింది. పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. పీఎంవో కోసం మొత్తం ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఎంపిక చేయగా..అందులో ఆమ్రపాలి ఒకరు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా… 2023 అక్టోబర్ 27వరకు ఆమ్రపాలి కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
2010 బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ ఆమ్రపాలి.. తెలంగాణలోని పలు జిల్లాల్లో పని చేశారు. వికారాబాద్ సబ్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అమ్రపాలితో పాటు పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్‌ను.. అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ నియమించింది.