కలెక్టరమ్మ పెళ్లా మజాకా.. రిసెప్షన్ పార్టీ అమోఘం..

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. కలెక్టర్ క్యాంపాఫీస్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ నేతలు, జిల్లా అధికారులు, మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై నూతన వధూవరులు దంపతులు దండలు మార్చుకోగా, అతిథులు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. అంతకుముందు ఆమ్రపాలి దంపతులు కుటుంబ సభ్యులతోపాటు వరంగల్ లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఫిబ్రవరి18 అమ్రపాలి, సమీర్ శర్మ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా.. సమీర్ శర్మ 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. భధ్రకాళి అమ్మవార్ని దర్శించుకున్న సమయంలోని ఫొటోలు ఇవి..