మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య, బ్యాంకర్ అమృత ఫడ్నవీస్.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 75 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. అయితే.. ఆమె నడిచిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఆ ఫోటోలకు ట్యాగ్ చేస్తూ.. “ఆహారం, ఆరోగ్యం మరియు స్థిరత్వం గురించి అవగాహన పెంచడానికి రెడ్ కార్పెట్ పై నడిచాను” అని రాస్తూ పోస్ట్ చేశారు అమృత ఫడ్నవీస్.
అమృతతో పాటు.. ఐవరీ కోస్ట్ ప్రథమ మహిళ డొమినిక్ ఔట్టారా, లెబనీస్-జోర్డానియన్ యువరాణి గిడా తలాల్, నటుడు స్టోన్ తదితరులు ఉన్నారు. అమృత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇటీవల ఉక్రెయిన్ లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అఘాయిత్యాలను ఆపండి అంటూ.. ఉక్రెయిన్ కు చెందిన నటి అర్ధనగ్నంగా నిరసన చేసింది. తన దుస్తులను విప్పి అర్ధనగ్నంగా నినాదాలు చేసింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్ జెండా రంగులను వేసుకొని.. మాపై జరిగే అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేసింది.