సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ సినిమా తమ కుటుంబాల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ప్రణయ్ భార్య అమృత ఇరు కుటుంబాలు సినిమా విడుదల కాకుండా నిలిపివేయాలని హైకోర్టు కంట్మెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కారణం వర్మ ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూ షో ను వేయడం.
తన కథనే ఆధారంగా ఈ సినిమాను రూపొందించారని అమృత తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన కథ కథ తో తీసిన చిత్రం కాదని వర్మ కోర్టును తప్పుదోవ పట్టించారని ఈ పిటిషన్ పై విచారణ చేయాలని కోరింది. అయితే ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు విచారణకు నిరాకరించడంతో మర్డర్ చిత్రయూనిట్ రేపు విడుదలకు సిద్ధమైంది.