తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటించింది అమైరా దస్తుర్. తెలుగులో ఆమె మనసుకు నచ్చింది, రాజుగాడు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
మొదటి సినిమాలో సందీప్ కిషన్ హీరో కాగా, రెండో దానిలో రాజ్ తరుణ్. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలను మహిళా దర్శకులే తెరకెక్కించారు. మంజుల ఘట్టమనేని మనసుకు నచ్చింది చిత్రాన్ని రూపొందించగా, జర్నలిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ సంజనా రెడ్డి రాజుగాడు ను తీశారు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగలో అంతగా రాణించలేదు.
మోడల్ గా, యాక్టర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అమైరా దస్తూర్ ఇప్పుడు పంజాబీ భాషలోకి అడుగుపెడుతోంది. జెస్సీ గిల్ హీరోగా,అమర్ హుందాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుర్టీలా సినిమాలో అమైరా దస్తుర్ నటిస్తోంది.
ఈ తరం యువత మనోభావాలకు దగ్గరగా ఉండే న్యూ ఏజ్ మూవీ ఇదని అమైరా తెలిపింది. ఈ తరహా సినిమాలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉందని, కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఉండేదని ఆమె అన్నారు.
అయితే ఇప్పుడు విభిన్నమైన చిత్రాలు రావడం మొదలైన తర్వాత ధైర్యంతో ఈ ప్రాజెక్టు ను టేకప్ చేశానని ఆమె తెలిపింది.అమైరా ఎంట్రీతో ఆ చిత్ర బృందం కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.