ఒక్క ఛాన్స్ అని స్టార్ట్ అయ్యి ..స్టార్ హీరోయిన్లు అయినవాళ్ళు చాలా మంది ఉన్నారు. మోడల్ గా మొదలయ్యి మెగాఫోన్ పట్టిన హీరోయిన్లూ ఉన్నారు. యాంకర్ గా కెరీర్ మెదలెట్టి హీరోయిన్ గా తమ కెరీర్ని సుస్థిరం చేసుకున్న వాళ్ళూ ఉన్నారు.
సినిమా రంగంలో రాణించాలని చాలామంది కలలు కంటుంటారు. హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ హీరోయిన్లు కాలేరు.. హీరోయిన్స్ కావాలంటే అందం, అభినయంతో పాటూ అదృష్టం కూడా ఉండాలి.
కొంత మంది పెద్దగా ప్రయత్నం చేయకుండానే స్టార్ హీరోయిన్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇండస్ట్రీలోకి బుల్లితెర యాంకర్‌గా అడుగుపెట్టి ఆ పై వచ్చిన క్రేజ్ తో హీరోయిన్లుగా ఎదిగిన కొంతమంది తారల గురించి తెలుసుకుందాం.
ముందుగా మెగా డాటర్ నిహారిక గురించి తెలుసుకుందాం.. ఇండస్ట్రీకి యాంకర్‌గా వచ్చి ఆ తర్వాత హీరోయిన్‌గా మారిపోయింది మెగాడాటర్. ఓ డ్యాన్స్ షోకి బుల్లి తెరపై యాంకర్‌గా పనిచేసింది. అయితే అక్కడ ఆమె యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది.
హీరోయిన్ రెజీనా కస్సాండ్రా.. ఈ ముద్దుగుమ్మ కూడా ఒకప్పుడు బుల్లి తెర యాంకర్. అయితే ఆ విషయం చాలా మందికి తెలియదు. మొదట్లో హీరోయిన్ రేజీనా ఓ చానల్‌లో క్విజ్ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా పనిచేంది.
‘కందనాల్ ముదల్(2005)’ చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది రేజీనా. అప్పటికి ఆమె వయస్సు 16 ఏళ్ల మాత్రమె. ఇక తెలుగులో 2012 లో సుదీర్ బాబు హీరోగా వచ్చిన ‘శివ మనసులో శృతి (SMS)’ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కలర్స్ స్వాతి… అతి చిన్న వయసులో ఒక ప్రముఖ టీవీ చానల్ లో ‘కలర్స్’ అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా పనిచేసింది. ఆ ప్రోగ్రాంతో తెలుగునాట సూపర్ పాపులర్ అయింది. అప్పటినుంచే ఆమె పేరు ముందు ‘కలర్స్’ నిలిచిపోయింది. ఇక యాంకర్ తరువాత సినిమా రంగంలో అనేక పాత్రలు పోషించింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. ఆ తరువాత 2008లో ‘అష్టా చెమ్మా’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2008 లో ఈ సినిమాకు గాను ఆమెకు నంది పురస్కారం కూడా లభించింది.
అనసూయ భరద్వాజ్… ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా ఎవరు అంటే మొదటగా వచ్చేది కనకాల సుమ పేరు. ఆమె తరువాత చెప్పాలంటే ఖచ్చితంగా అనసూయనే. ఇక అనసూయ టాలీవుడ్ లోకి ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ చిత్రం ద్వారా అడుగుపెట్టింది.
అయితే ఒక ప్రముఖ చానెల్ లో కామెడీ షో ద్వారా యాంకర్ గా ప్రవేశించింది. ఇక అప్పటి నుంచి నేటి వరకు ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో ప్రత్యెక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ హాట్ యాంకరమ్మ. అనసూయ ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కథనం’ సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది.
శ్రీముఖి…ఈమె యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పటికి యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మధ్యమధ్యలో కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తుంది. 2015 లో ‘చంద్రిక’ సినిమా తో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది.
రష్మి గౌతమ్.. ఇక ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై రాణిస్తున్న టాప్ యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. 2007లోనే యాంకరింగ్ రంగంలోకి అడుగులువేసిన ఈ హార బ్యూటీ ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతూనే అడపాదడపా సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ‘గుంటూరు టాకీస్’ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది.
Also Read: ఆ డైరెక్టర్ శిష్యులు అందరూ హిట్ లు కొడుతున్నారుగా…?