మేము కూడా రాస్తాము లెటరు ! - Tolivelugu

మేము కూడా రాస్తాము లెటరు !

, మేము కూడా రాస్తాము లెటరు !

టీవీ9 వ్యవస్థాపకుడు రవిప్రకాష్ మీద ఈడీ సీబీఐ దర్యాప్తు చేయాలని ఎవడో ఒక క్రిమినల్ పూర్తిగా నేరచరిత్ర ఉన్నటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యత్వాన్ని అడ్డంపెట్టుకుని ఆ పేరు మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాయడం పెద్ద కామెడీ.

ఒకవేళ ఆ లెటర్ ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి దర్యాప్తుకు ఆదేశిస్తే, కోట్లాదిమంది తెలుగు ప్రజలు, భారతీయులు కూడా అదే భారత ప్రధాన న్యాయమూర్తి గారికి, ఇతర సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇతర అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు, సిట్టింగ్ న్యాయమూర్తులకు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి మేం కూడా లెటర్లు పెడతాం.

ఏమని అంటే.. మేఘా ఇంజనీరింగ్, మైహోమ్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా జరుగుతున్న ఘోరాలు మీద ఎంక్వయిరీ చేయించి లోపలికి తోయాలని.

అంతేకాదు, గత ఎన్నికల్లో వైసీపీకి వేలాది కోట్ల రూపాయల నిధులు ఎక్కడ నుంచి వచ్చాయో ఆ సంగతి కూడా తవ్వి తీసి సుప్రీంకోర్టు, సీబీఐ, ఈడీలు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని లెటర్లు వ్రాస్తాం మరి.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా…..!

ఈరోజు నుంచే తెలుగువాళ్ళం అందరం కుప్పలు తెప్పలుగా ఆ లెటర్లు వ్రాయడం మొదలుపెడదాం. విజయదశమి ముహూర్తం  కూడా బావుంది.

ఇట్లు

– ఓ తెలుగువాడు

 

Share on facebook
Share on twitter
Share on whatsapp