హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. శనివారం ఉదయం భర్తతో వాకింగ్ వెళ్లిన ఓ మహిళ గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. వాక్ వేలో నడుస్తున్న సమయంలో ఓ దుండగుడు సదరు మహిళను వెంబడించాడు.
కొంత దూరం వెళ్లాక మహిళను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమె కేకలు వేసింది. దీంతో తన భర్త తోపాటు.. చుట్టుపక్కల వారు రావడంతో దుండగుడు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పలు కోణాల్లో విచారణ చేపట్టారు.
ఇప్పటికే నటి షాలు చౌరాసియా పై ఓ ఆగంతకుడు ఇదే పార్క్ లో లైంగిక దాడికి యత్నించాడు. నిర్మానుష్య ప్రాంతంలో పట్టుకుని లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యక్తి నుంచి చౌరాసియా తప్పించుకుంది.
తాజాగా అలాంటి ఘటన మళ్లీ అక్కడే చోటు చేసుకోవడం బాగ్యనగరంలో కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలతో బంజారా హిల్స్ కేబీఆర్