అధికార టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… మేడ్చల్ జిల్లా, జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కే సీఆర్ కూరగాయల మార్కెట్ దగ్గర టీఆర్ఎస్ బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందారు. హాస్పిటల్ లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆదివారం బతుకమ్మ పండుగ సందర్భంగా కల్వకుంట్ల కవిత రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలు కట్టే పనిలో ఉన్న రాజు అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో అక్కడి కక్కడే మృతి. రాజు వయసు 19 సంవత్సరాలు.