సూర్యాపేటలో విషాదం నెలకొంది. కొత్త బస్టాండ్ దగ్గర డీజిల్ ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
ఖాళీ ట్యాంక్ కు వెల్డింగ్ చేస్తుండగా పేలుడు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఖాళీ ట్యాంక్ పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.
ట్యాంక్ పేలడంతో బస్టాండ్ పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో సూర్యాపేట వాసులంతా భయాందోళనకు గురయ్యారు.