రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు. నానా హంగామా చేశాడు. డీఈఈ, ఏఈఈలపై విరుచుకుపడ్డాడు. ఈ తతంగాన్ని కవర్ చేస్తున్న విలేఖరి పట్ల కూడా కాంట్రాక్టర్ దురుసుగా ప్రవర్తించాడు.
కుమార్ అనే కాంట్రాక్టర్ తన ఫైల్ పై సంతకం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో అధికారులను బెదిరింపులకు గురి చేశాడు. గట్టిగా అరుస్తూ మహిళా ఉద్యోగులపై కాంట్రాక్టర్ మండిపడ్డాడు. సంతకం పెట్టకపోతే మీ పని ఏంటో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.
ఇక అక్కడే ఉండి ఈ తతంగాన్నంతా చిత్రీకరిస్తున్న విలేఖరిపై కూడా కాంట్రాక్టర్ దాడికి యత్నించారు. తన పర్మిషన్ లేకుండా వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నావంటూ ఫోన్ లాగేసుకొని నానా హంగామా చేశాడు.
వీడియో డిలీట్ చేయమని.. లేకపోతే నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కాంట్రాక్టర్ తీరుపై విలేఖరి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.