ల్యాండ్‌లైన్ వినియోగదారులకు టెలికాం శాఖ కొత్త సూచన చేస్తోంది. ఇకపై ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేసినప్పుడు కస్టమర్లు ముందు అదనంగా సున్నా అంకెను చేర్చి ఆ తర్వాత నెంబర్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ట్రాయ్ చేసిన ప్రతిపాదననను టెలికాంశాఖ ఆమోదించింది. వచ్చే నూతన సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
కొత్త నిబంధనకు తగినట్టుగా ల్యాండ్‌లైన్ నంబరు డయిలింగ్ ప్యాట్రన్‌లో తగిన మార్పులు చేయాలని టెలికాం సంస్థలకు ఆ శాఖ సూచించింది. అలాగే కంపెనీలు ఈ కొత్త నిబంధన గురించి తమ ల్యాండ్‌లైన్ కస్టమర్లకు అవగాహన కల్పించాలని తెలిపింది.