ఓ కామాంధుడి మాయమాటలకు ఇంటర్ బాలిక బలైపోయింది. కాలేజీకి తీసుకెళ్లేందుకు నమ్మకంగా ఉంటాడనుకున్న డ్రైవర్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోచరుచుకున్నాడు. చదువు అయ్యాక ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పటంతో ఆ బాలిక ఆ దుర్మార్గుని మాటలు నమ్మి మోసపోయింది.
అనంతపురం జిల్లా పెద్దతిప్పసముద్రం మండల పరిధిలో జూనియర్ ఇంటర్ చదువుతోన్న బాలికను గ్రామం నుండి కాలేజీకి రోజూ వ్యాన్‌లో వెళ్లేది. ఆ వ్యాన్ డ్రైవర్ మల్లికార్జున్ బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. కాలేజీకి తీసుకెళ్లకుండ తన ఫ్రెండ్స్ రూంకు, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆత్యాచారం చేశేవాడు. ఆ క్రమంలో బాలిక రెండుసార్లు గర్భం దాల్చగా… అబార్షన్ చేయించాడు. దాంతో బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని కోరటంతో మల్లికార్జున్ తప్పించుకు తిరిగాడు. ఆ బాధితురాలు మల్లికార్జున్ గురించి ఎంక్వైరీ చేయగా… తనకు ఇద్దరు పిల్లలున్నారని, పైగా పెద్దవారని తెలియటంతో మోసపోయానని గ్రహించిన ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు మల్లికార్జున్ కోసం గాలిస్తున్నారు.