కోలీవుడ్ స్టార్ సూర్యకు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటి నుంచో ఆయన సినిమాలు ఇక్కడ విడుదలవుతూ మంచి హిట్ అందుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆయన ఈటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేకాకుండా విక్రమ్ సినిమాలో రోలెక్స్‌గా ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే సూర్య తన 42వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కనున్న ఫాంటసీగా రానుందని తెలిపారు.
ఈ భారీ ప్రాజెక్ట్ ని దర్శకుడు శివ అయితే తెరకెక్కిస్తున్నాడు. మరి భారీ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా సూర్య ఫ్యాన్స్ లో ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ పై ప్రతిష్టాత్మక అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి ఇంతలా హైప్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉండగా లేటెస్ట్ గా అయితే ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమాపై వినిపిస్తుంది.
దీని ప్రకారం అయితే మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని అతి త్వరలోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ భారీ స్కేల్ ఉన్న ప్రాజెక్ట్ మేకర్స్ అయితే ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేసారో చూడాలి.
అలాగే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.