ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోన్న ఈ సమయంలో బ్రీత్ ఎనలైజర్లను వాడొద్దని ”వాదా ఫౌండేషన్” అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను కోరింది. కరోనా వైరస్ దగ్గు, జలుబు, తుమ్ముల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి చాలా వేగంగా వ్యాపిస్తుందని… ఇలాంటి సమయంలో అపరిశుభ్రంగా ఉండే బ్రీత్ ఎనలైజర్ల వాడకం ప్రమాదకరమని సంస్థ ఫౌండర్ సురేష్ రాజు ఓ వినతి పత్రంలో కమిషనర్ ను కోరారు. ఇది ప్రజలకే కాదు…ఇది ఉపయోగించే పోలీసు సిబ్బంది జీవితాలకు కూడా ప్రమాదమేనని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తన విజ్ఙప్తిని తీవ్రంగా పరిగణించి సరైన చర్యలు తీసుకోవాలని రాజు కమిషనర్ ను కోరారు.
Advertisements