భారత అటవీ శాఖ అధికారి సుశాంత నందా ఎప్పటికప్పుడు వణ్యప్రాణులకు సంబంధించి ఆసక్తికర కంటెంట్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఆయన పెట్టే పోస్టులకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున లైక్ లు, కామెంట్లు వస్తాయి.
తాజాగా ఆయన ట్విట్టర్ లో ఓ ఫోటోగ్రాఫ్ ను షేర్ చేశారు. దానికి ధ్యానం చేస్తున్న గుడ్లగూబ( మెడిటేటింగ్ ఓల్) అనే క్యాప్షన్ పెట్టారు. మీరు ఇంతకు ముందెన్నడూ చూడని మెడిటేటింగ్ గుడ్లగూబ. ఇది మిమ్మల్ని పూర్తిగా మభ్యపెడుతుంది అని ఆ పోస్టులో ఆయన రాసుకొచ్చారు.
ఆ గుడ్లగూబ ఓ చెట్టుపై కూర్చుని కండ్లు మూసుకుని ఉంది. గుడ్లగూబ చెట్టు బెరడు రంగులో ఉండటంతో చెట్ల మధ్య దాన్ని గుర్తించడానికి కొంచెం సమయం తీసుకుంటోంది. దీంతో అందరూ దీన్ని ఫజిల్ లాగా భావిస్తూ దాన్ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఎంజాయ్ చేస్తు్న్నారు.
దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇది ఒక కంటెస్ట్ లాగా ఉందని కొందరు అంటుండగా.. అది చెట్టు మధ్యలో ఉందని గుర్తించేందుకు కొంత సమయం పట్టిందని మరి కొందరు అన్నారు. మరి మీరు ఆ గుడ్లగూబను గుర్తించగలరా ఓ సారి ట్రై చేయండి…