సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా ‘సర్వారు వారి పాట’ చిత్రాన్ని దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనిలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు మిలియన్స్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాను మే 12న విడుదల చేయనున్నారు మేకర్స్.
రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్‌డేట్స్‌ను వదులుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో మహేష్ మరింత స్టైలీష్ లుక్‌లో కనిపించనుండడంతో సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు మహేష్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్‌ను పూర్తి కీర్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
‘సర్కారు వారి పాటకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశాను. సూపర్ స్టార్ మహేష్‌ను అందరిలా చూడటానికి ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నాను. ఆయన ఫ్యాన్స్‌కు పక్కా ట్రీట్ ఉంటుంది’అని కీర్తీ సురేష్ ట్వీట్ చేసింది. దీనికి డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫోటోను యాడ్ చేసి షేర్ చేసింది కీర్తి.
బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించగా.. తమన్ స్వరాలు అందించారు.
Final touches for dubbing is done! Cant wait for everyone to see Super⭐@urstrulymahesh in this one. A treat for all his fans! ❤️
Love,
Kalaavathi #SarkaruVaariPaata #SVPOnMay12 pic.twitter.com/KsKub6MiG0— Keerthy Suresh (@KeerthyOfficial) May 1, 2022
Advertisements