ఫ్రీవైఫ్ కి ఆశపడిన ఓ యువకుడికి నిరాశ మిగిలింది. డేటా ఆదా చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం అతని అకౌంట్ నుంచి రూ.50 వేలు మాయం చేసింది. తాజా వైఫై మోసం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కుమార్ అనే యుకుడు చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ రావడం జరిగింది. కోచింగ్ నిమిత్తం అతని కుటుంబ సభ్యలు ఆన్ లైన్ లో డబ్బు పంపించారు.
మైండ్ రిలీఫ్ కోసం ఓ షాపింగ్ మాల్ కు వెళ్ళాడు కుమార్. అక్కడ ఫ్రీవైఫై సిగ్నల్ కనిపించింది. ఫ్రీనే కదా కాసేపు స్వంత డేడా ఆదా చేద్దాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కనెక్ట్ అయ్యాడు. కాసేపటికి మెసేజులు రావడం మొదలుపెట్టాయి.
ఇలా కొంచెం కొంచెంగా అతని అకౌంట్లోని 50 వేల రూపాయలు పోవడాన్ని గమనించి ఖంగుతిన్నాడు. వెంటనే షాపింగ్ మాల్ వాళ్ళను నిలదీశాడు. ఫ్రీ వైఫై ఆశ చూపించి ఎదుటి వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టెస్తారా అని గట్టిగా అడిగాడు.
అయితే షాపింగ్ మాల్ యాజమాన్యం సదరు వ్యక్తిపై రివర్స్ అయ్యింది. అసలు తమ మాల్ కి ఫ్రీ వైఫై యాక్సెస్సే లేదు అనితెలిపింది. దీంతో ఏం చెయ్యాలో తెలీక కుమార్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసే దర్యాప్తు చేస్తున్నారు.
పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే వైఫైని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు, అధికారులు . అలా చేస్తే సోషల్ మీడియా ఓపెన్ చేసేందుకు, బ్యాంక్ లావా దేవీల కోసం నమోదు చేసే యూజర్ ఐడీ & పాస్ వర్డ్ లను మాల్ వేర్ ద్వారా సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ వైఫై వాడాల్సి వస్తే అధికారకమా, కాదా అనేవిషయాన్ని నిర్ధారించు కోవాలని సూచిస్తున్నారు.