ఇప్పటి వరకు కోవిడ్ -19 నిర్ధారణ కోసం ముక్కు మరియు గొంతులో స్వాబ్స్ పెట్టి టెస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా చైనాలోని బీజింగ్ లో ఆనల్ స్వాబ్ ( పాయువు నుండి శాంపిల్స్ తీసుకోవడం ) స్టార్ట్ చేశారు! పాయువులో వైరస్ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి. అనల్ టెస్టింగ్‌లో తప్పుడు ప్రతికూలత వచ్చే అవకాశం లేదని వీరి వాదన…. ఇతర దేశాల నుండి తిరిగి వచ్చిన ప్రజలకు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆనల్ టెస్టింగ్ చేస్తున్నారు. బీజింగ్ యువాన్ హాస్పిటల్, రెస్పిరేటరీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డిప్యూటీ డైరెక్టర్ లి టోంగ్‌జెంగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముక్కు లేదా గొంతు పరీక్ష కంటే ఆనల్ స్వాబ్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు.
tes
చైనాకు చెందిన చాలా మంది శాస్త్రవేత్తలు దీనికి అంగీకరించడం లేదు. కొవిడ్ టెస్ట్ కు ప్రస్తుతం కొనసాగుతున్న ముక్కు, గొంతు స్వాబ్ పరీక్షలు చాలు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ రకం పరీక్షలపై చైనా పౌరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.