సోపతోనికి తోడుండకపోతే ఎట్లా....? - Tolivelugu

సోపతోనికి తోడుండకపోతే ఎట్లా….?

ఒక అవాంఛనీయ కుట్ర జరిగినప్పుడు…

మనం జర్నలిస్టులం. ఎక్కడో.. ఏదో అన్యాయం జరిగిందని, జరగబోతోందని రాస్తాం.. చూపుతాం…

మరి ఒక పాత్రికేయుడిని నిర్దాక్షిణ్యంగా, దాష్టికంగా అనేక ఇబ్బందులకు గురిచేశారు. చేస్తున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు రాయలేని కలం✍🏻, చూపలేని 🖥 జర్నలిస్టులు ఈదే వృత్తిలో కొనసాగే నైతిక హక్కు ఉందా..?

అవసరం ఉన్నప్పుడు, అవసరానికి ‘ధైర్యంగా ముందుకు రాని
తెరవెనుక మద్దతు’ ఎందుకు..?

ఇక కోవర్టుల గురించి…
పాత్రికేయులు రవిప్రకాష్ ఇలాంటి కోవర్టులను ఎంతో మందిని చూశారు. ఎంతో స్నేహంతో ఉండే వారే నమ్మకంగా వెన్నుపోటు పొడిచారు.

వేలాదిమంది నేడు ఎలక్ట్రానిక్ మీడియాలో కొనసాగటానికి పునాదులు వేసింది ఆయనే. ఆయనపై జరిగిన, జరుగుతున్న కుట్రలను బహిరంగంగా ఖండించకపోతే.. వారు జర్నలిజం వృత్తిలో కొనసాగే అర్హత ఉందా..?

టివి ప్రాసారాలు ప్రసారం చేయడం లేదని యాజమాన్యాల తరఫున రోడ్లు ఎక్కే వారు… ఓ జర్నలిస్ట్ పై జరుగుతున్న కుట్రల గురించి ‘భయాల’ మాటున ప్రశ్నించక పోవటం…?
ఏ జర్నలిజంలోకి వస్తుందో వారికే వదిలేద్దాం.

పాత్రికేయులు రవిప్రకాశ్ గారికి బెయిల్ వచ్చిన రోజున తప్పకుండా అందరూ రాల్సిందే. పెద్ద ఎత్తున పాత్రికేయులు, అభిమానులు వస్తారని తెలిస్తేనే… ప్రభుత్వం, దాని వెనుక ఉండే ‘బడా రాస్కెల్స్’ భయపడతారు. కలంతో ఎలాగో భయపెట్టలేక పోతున్నారు. కనీసం రవిప్రకాశ్ ను కలసి ‘మీం మీ వెంటఉన్నాం’ అని సంఘీభావం కూడా ప్రకటించకపోతే… భావితరాలకు మనం ‘పాపభీతిని’ బహుమతిగా ఇస్తున్నట్లే.🙏🏻

మీ
✍🏻
అనంచిన్ని వెంకటేశ్వరరావు,
అధ్యక్షులు,
తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం

Share on facebook
Share on twitter
Share on whatsapp