ఉద్దండ పిండాలను రంగంలోకి దించారు.. రవిప్రకాశ్‌ను రానివ్వరు.. - anamchinni venkateswararao opinion on ravi prakash bail petition- Tolivelugu

ఉద్దండ పిండాలను రంగంలోకి దించారు.. రవిప్రకాశ్‌ను రానివ్వరు..

పాత్రికేయులు రవిప్రకాశ్ ను మరికొద్ది రోజులు జైలులో ఉంచే ప్రయత్నం జరుగుతోందా..? ‘ఆదాబ్ హైదరాబాద్’ సీనియర్ జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు ఏమంటున్నారు..?

anamchinni venkateswararao opinion on ravi prakash bail petition, ఉద్దండ పిండాలను రంగంలోకి దించారు.. రవిప్రకాశ్‌ను రానివ్వరు..తప్పుడు కేసు, తప్పుడు ఎఫ్ఐఆర్, తప్పుడు అరెస్ట్‌పై ఓ వైపు జర్నలిస్టు సోదరులు ఆందోళన చెందుతున్న అవాంఛనీయ సందర్భం. రేపు రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో బెయిల్ పిటిషన్ అడ్డుకునే ప్రయత్నం జరగబోతోంది. రాష్ట్ర పోలీస్ శాఖ రవిప్రకాశ్‌కు మరిన్నిరోజులు రిమాండ్ అడుగుతుందని సమాచారం.

హైకోర్టులో ప్రభుత్వం తరఫున ‘ఉద్దండ పిండాలను’ రంగంలోకి దించారు. 4రోజుల రిమాండ్ కోసం ప్రభుత్వ న్యాయవాదుల కసరత్తులు చేస్తున్నారు.

‘ఆదాబ్ హైదరాబాద్’కు ఉన్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం రేపు రవిప్రకాశ్ గారికి బెయిల్ రాదు. అందుకోసం “బడా రాస్కెల్స్’ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది.

ఇది ఒక్క రవిప్రకాశ్ తో ఆగదు. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ వస్తుంది. మనం మేల్కోకపోతే  ప్రభుత్వాలు అందరి  డ్యాష్ డ్యాష్ తీర్చేస్తాయి.

ఈ సందర్భంగా జర్మనీ కవి మార్టిన్ నెమోలర్ రాసిన కవితను గుర్తుచేస్తున్నాను…

”నాజీలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్టును కాదు కదా, నాకోసం రాలేదని ఊరుకున్నాను. తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడూ ఊరుకున్నాను. తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. నాకు సంబంధించిన విషయం కాదు కదా అని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేనలు యూదుల కోసం వచ్చారు. అది కూడా నేను కాదు కదా అని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేవలు నా ఇంటి దాకా వచ్చారు.. నా కోసం వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే నా కోసం ఎవ్వరూ కనపడలేదు”

భూల్నా మత్ యారో తేరా నెంబర్ భీ ఆయేగా…

Share on facebook
Share on twitter
Share on whatsapp