ఫార్ములా రేసింగ్ వరల్డ్ చాంపియన్ షిప్ శనివారం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫార్ములా రేసింగ్ నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసారు. రేసింగ్ సర్య్కూట్‌లో ఫార్ములా ఈరేసు కార్లు అదరగొట్టాయి. ఇండియాలో మొదటిసారి నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పోటీని చూసేందుకు దేశ నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోటీలను చూసేందుకు వచ్చిన ప్రముఖ దిగ్గజ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు. దీనిని పక్కనే ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇంకేముంది!? అదికాస్త వైరల్‌గా మారింది.అనంతరం ఆ వీడియోను ఆనంద్ మహీంద్రా సైతం ట్విట్టర్‌లో పోస్టు చేసి, ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించాలని, ఆల్ ద బెస్ట్ చెప్పారు.