ఆర్ఆర్ఆర్ చిత్రంతో మెగా పవర్ స్టార్ నుంచి ‘గ్లోబల్ స్టార్’ గా మారిపోయాడు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం భారత్ లోనే కాకుండా అమెరికా, జపాన్ వంటి దేశాల్లోనూ సంచలన విజయం సాధించింది. అందులోనూ నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ బరిలో నిలిచి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించేలా చేసింది.
ఈ చిత్రంలో అద్భుత నటన కనబర్చిన రామ్ చరణ్ పై అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు లభిస్తున్నాయి. తాజాగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ అనే ప్రఖ్యాత టీవీ షోలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించాడు. దీంతో చెర్రీని అందరూ గ్లోబల్ స్టార్ అనడం మొదలుపెట్టారు.
లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ ప్రభంజనంపై ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఆయన.. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ పై ప్రశంశలు కురిపించారు. ‘మెగా పవర్ స్టార్.. ప్రెజెంట్ గ్లోబల్ స్టార్’ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
This man is a Global Star. Period. #NaatuNaatu @AlwaysRamCharan https://t.co/JcanE3OJmq
— anand mahindra (@anandmahindra) February 25, 2023