నేషనల్ స్టాక్ ఎక్చేంజీ(ఎన్ఎస్ఈ) గ్రూప్ ఆపరేటింగ్ మాజీ అధికారి ఆనంద్ సుబ్రమణ్యన్ ను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. 2018లో స్టాక్ మార్కెట్ లో అవతవకలకు సంబంధించి ఆయనను సీబీఐ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
అరవింద్ సుబ్రహ్మణియన్ ను చెన్నయ్ లోని ఆయన నివాసంలో గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అతన్ని ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలిస్తున్నట్టు తెలిపాయి. అనంతరం అతన్ని స్థానిక కోర్టులో హాజరు పరిచి కస్టడీకి కోరతామని పేర్కొన్నాయి.
ఎన్ఎస్ఈలోని రహస్య సమాచారాన్ని హిమాలయ యోగితో అప్పటి చీఫ్ చిత్ర రామకృష్ణ పంచుకున్నారని సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా తెలిపింది. ఆ యోగి సూచనల మేరకు నిబంధనలకు విరుద్దంగా అరవింద్ సుబ్రహ్మణ్యాన్ని గ్రూపు ఆపరేటింగ్ ఆఫీసర్ గా చిత్ర నియమించారని సెబీ ఓ ప్రకటనలో తెలిపింది.
సెబీ ప్రకటన అనంతరం చిత్ర రామకృష్ణ, అరవింద్ సుబ్రహ్మణియన్ ల నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఇక సెబీ ప్రకటన నేపథ్యంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే చిత్ర సుబ్రహ్మణియన్ ను సీబీఐ మూడు రోజుల పాటు ప్రశ్నించింది.