ఒమిక్రాన్ మహమ్మారితో ప్రపంచం వణికిపోతుంది. ప్రపంచదేశాలు ఆంక్షల గుండంలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో, మరోసారి నెల్లూరు చెందిన ఆనందయ్య పేరు మరోసారి చర్చనీయాంశం అయింది. గతంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సమయంలో ఆయన తయారు చేసిన ఆయుర్వేద మందు చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చింది. కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు సైతం కోలుకున్నట్టు అప్పట్టో వార్తలు వచ్చాయి. దీంతో, ఆ సయమంలో ఆయన ఒక ఆశాకిరణంలా కనిపించారు.
అయితే, ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ వణికిస్తున్న నేపథ్యంలో ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఒమిక్రాన్ మందును కూడా తాను తయారు చేశానని ఆనందయ్య ప్రకటించారు. దీంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కి కూడా మందు తయారు చేసినట్టు ఆనందయ్య చెప్పుకొచ్చారు. ఓమిక్రాన్ వైరస్ బారిన పడిన రోగులు తనను సంప్రదిస్తే స్వయంగా వచ్చి వైద్యం అందిస్తానని తెలిపారు. కేవలం 48 గంటల్లోనే ఓమిక్రాన్ వైరస్ నుంచి కోలుకునేలా చేస్తానని అన్నారు. దీంతో ఎంతో మంది జనం ఆనందయ్య మందు తీసుకొనడానికి ఆసక్తి చూపుతున్నారు.