ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. గురువారం సాయంత్రం అనంత్, రాధికా మర్చంట్ ఎంగేజ్ మెంట్ ముంబైలోని ముకేష్ నివాసమైన ఆంటీలియాలో జరగనుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఘనంగా మోహందీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో పెళ్లి కూతురు రాధికా మర్చంట్ అలియా భట్ పాటకు డ్యాన్స్ చేసి ఇరగదీశారు. ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మెహందీ వేడుకలో రాధికా మర్చంట్ హెవీ ఎంబ్రాయిడరీ పింక్ కలర్ రేషమ్ లెహెంగా ధరించారు. ఈ లెహెంగాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జాని, సందీప్ కోస్లా ప్రత్యేకంగా రూపొందించారు.
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ కుమార్తె రాధికా మర్చంట్. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్ లో రాధికా ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత చదవుల కోసం న్యూయార్క్ వెళ్లారు.