కళ కళ కోసం.. సమాజం కోసం.. సమాజంలోని అన్ని వర్గాల కోసం.. కళాకారుడు ఏ కులం వాడైనా.. ఏ మతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ దేశం వాడైనా వృత్తి ధర్మంతో పనిచేస్తాడు. కుల, మత, ప్రాంత, జాతి, దేశ విభేదాలు ఉండవు.
కానీ.. కర్మ కొద్దీ తెలుగు మూవీ ఫీల్డులో మత పిచ్చ వున్న ఒక బ్యాడ్ మ్యాజిక్ డైరెక్టర్ ఉన్నాడట..! ఈ విషయాన్ని సినీ గీత రచయిత అనంత్ శ్రీరాం సినీ నటుడు అలీ నిర్వహించిన ఒక టీవీ షోలో స్వయంగా చెప్పాడు. హిందూ దేవుళ్ళ పాటకు నేను మ్యూజిక్ డైరెక్షన్ చేయను… అని ఆ మ్యూజిక్ డైరెక్టర్ అనడంతో అనంత్ శ్రీరాం అవాక్కయ్యాడు. అతని బ్యాడ్ నిర్ణయాన్ని ఆ దేవుడే చూసుకుంటాడని భవిష్యత్‌లో అతనికి పాటలు రాయకూడదని నిర్ణయించుకున్నాడు. దాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నాడు. అతని పేరు బయట పెట్టడానికి, కెరీర్ పాడు చేయడానికి అనంత్ శ్రీరాం మనసు ఒప్పుకోలేదు. అతని కర్మ ఫలం అతనిది.
తెలుగు సినీ ఫీల్డ్‌లో ఇలా వ్యవహరించిన వారు ఇంతవరకూ ఎవరూ లేరు. హిందువైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎన్నో ఇతర మతాల, దేవుళ్ళ పాటలు సగర్వంగా పాడారు. హిందూ మ్యూజిక్ డైరెక్టర్లు వాటికి సంగీతం అందించారు. అందరూ వాటిని విని ఆనందించారు. అలాగే ఏసుదాస్ క్రిస్టియన్ అయినా ఎన్నో హిందూ భక్తి గీతాలు సుమధురంగా ఆలపించారు. ఒక కళాకారుడిగా తన్మయత్వం చెందారు. అనంత్ శ్రీరాం చెప్పిన బ్యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ బాలు, ఏసుదాస్ వంటి కళాకారుల్ని స్పూర్తిగా తీసుకుంటే మంచిది..!