మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. కళావతి అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
మహేష్ లుక్స్, డ్యాన్స్‌లు అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి. ఇప్పుడు మిగిలిన పాటలను కూడా విడుదల చేయాల్సిన సమయం వచ్చింది. కాగా ఈ సినిమాలోని ఇతర పాటల గురించి మాట్లాడుతూ, అతి త్వరలోనే మాస్ నంబర్‌ను అప్‌లోడ్ చేయనున్నట్లు రచయిత అనంత శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
థమన్ అద్భుతంగా ఆ మాస్ సాంగ్ కు మ్యూజిక్ అందించారట. మహేష్ అభిమానులు దీన్ని కచ్చితంగా ఇష్టపడతారని అనంత శ్రీరామ్ అన్నారు.
సినిమాలోని ప్రతి పాట ఒకదానికొకటి భిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులు వాటిని పెద్ద స్క్రీన్‌పై తప్పకుండా ఆస్వాదిస్తారని చెప్పుకొచ్చారు. మరి చూడాలి మిగిలిన పాటలు ఎలా ఉండబోతున్నాయో.