పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ తో మంచి క్రేజ్ సంపాదించింది అనన్య నాగళ్ల. ఈ సినిమా సక్సెస్ తో తమిళ నాట ఛాన్స్ కొట్టింది. తమిళ నటుడు శశికుమార్ రాబోయే చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి ఈ బ్యూటీ ఎంపికైంది.
టైమ్ ట్రావెల్ బేస్డ్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రానికి అంజల ఫేమ్ తంగం పా శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే చిత్రీకరణ కూడా ప్రారంభం కానుంది.
ఇక ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం అనన్య నాగళ్ల రెండవ టైమ్ ట్రావెల్ ఆధారిత చిత్రంగా తెరకెక్కుతుంది. గతంలో, ఆమె ప్లే బ్యాక్‌లో నటించింది, ఇది కూడా టైమ్ ట్రావెల్ చిత్రమే.