హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పేరుకు ఆమె బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ, లైగర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు కూడా పరిచయమైంది. సినిమా ఇంకా రిలీజ్ కానప్పటికీ, ఆమెపై టాలీవుడ్ లో బజ్ బాగానే ఉంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లోకెక్కింది.
అవును.. అనన్య పాండే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం ఈమె సింగిల్. దాదాపు మూడేళ్లుగా అనన్య పాండే, ఇషాన్ కట్టర్ ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని వాళ్లు ఎక్కడా బయటకు చెప్పలేదు. పెద్దగా బయట కనిపించలేదు కూడా. సీక్రెట్ గానే డేట్ చేశారు. వీకెండ్స్ లో ముంబయిలోని ఓ అపార్ట్ మెంట్ లో కలుసుకునేవాళ్లు.
అలా మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట విడిపోయింది. దీనికి కారణాలు ఏంటనేది తెలియరాలేదు. బాలీవుడ్ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం.. ఇషాన్ కట్టర్ అనుకున్న స్థాయిలో క్రేజ్ సంపాదించుకోలేకపోయాడు. అతడికి పాపులారిటీ పెరగలేదు. ఇటు అనన్య పాండే మాత్రం బాగా పాపులర్ అయింది. సో.. అన్-పాపులర్ ఇషాన్ తో ఉండే కంటే, విడిగా ఉంటే బెటర్ అని ఆమె భావిస్తోందట.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భయంకరమైన ఫాలోయింగ్ ఉంది. ఇక కెరీర్ పరంగా కూడా పీక్ స్టేజ్ లో ఉంది. సౌత్-నార్త్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమెతో డేటింగ్ కు చాలా పెద్ద స్టార్స్ మొగ్గుచూపే అవకాశం ఉంది. అందుకే ఇషాన్ ను వదిలేసిందని చెప్పుకుంటున్నారు. పాపం ఇషాన్..