డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్. రెజ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ రెజ్లర్ గా కనిపించబోతున్నాడు. మరోవైపు విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. తెలుగులో అనన్య పాండే కి ఇదే మొదటి చిత్రం. కాగా తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న అనన్య ఈ సినిమాపై కొన్ని విషయాలను షేర్ చేసుకుంది.
నా తరువాత ప్రాజెక్టుల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నాను. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫైటర్ విభిన్నమైన ప్రపంచం. ఆ సినిమా సెట్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా సంతోషం పడుతున్నానని అనన్య పాండే చెప్పుకొచ్చారు.