అనుకున్నట్లే… జబర్ధస్త్ టీం ఈటీవీ నుండి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జబర్ధస్త్ జడ్జెస్ నాగబాబు, రోజాలు షోకు గుడ్‌బై చెప్పారని వార్తలు వస్తున్న నేపథ్యంలో… యాంకర్ అనసూయ కూడా నాగబాబు దారిలోనే నడుస్తోంది.
లోకల్‌గ్యాంగ్ పేరుతో జీ తెలుగు మొదలుపెడుతోన్న ఈ కార్యక్రమానికి నాగబాబు, రోజా, అనసూయతో పాటు జబర్ధస్త్ టీం లీడర్స్ కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైపర్ ఆది, చమ్మక్ చంద్రలు నాగబాబుటీంతోనే వెళ్లిపోయినట్లు సమాచారం.
మరీ వీళ్లంతా లేని జబర్ధస్త్ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.