బుల్లితెర యాంకర్ అనసూయ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోలను వీడియోస్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా మూడేళ్ల కిందటి వీడియోను పోస్ట్ చేసి తనపై అసభ్యత కామెంట్ చేసిన వ్యక్తి కి ఘాటుగా రిప్లై ఇచ్చింది అనసూయ. షూటింగ్ సమయంలో అనసూయ అనుకోకుండా కళ్లు తిరిగి పడిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రచారం కోసమే అనసూయ అలా పడిపోయింది అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు. అంతేకాకుండా అసభ్యకరమైన పదం కూడా వాడాడు.
ఈ ట్వీట్ పై అనసూయ ఫైర్ అయ్యింది. ఇతరులను నిందించడం చాలా సులభం. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నాకు లోబీపీ ఉంది. 22 గంటల పాటు నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొన్న తర్వాత తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు నేను అలా కళ్లు తిరిగి పడిపోయాను. ఏం జరిగిందో తెలియక ఎలా కామెంట్ చేస్తావ్.. మిస్టర్ ఆదిత్య !! నన్ను అసభ్యంగా దూషించాలనే ఉద్దేశంతోనే మూడేళ్లక్రితం వీడియోను వెతికి తీసి ఇలా కామెంట్ చేస్తున్నావా నిన్ను కూడా అసభ్యంగా తిట్టటానికి నాకు ఎలాంటి సిగ్గు భయం లేదు. ఎందుకంటే నువ్వు మొదలు పెట్టావు కానీ ఇలా చేస్తున్నందుకు బాధగా ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు అంటూ రిప్లయ్ ఇచ్చింది.
Now you my dear are an Attention seeking B*****d digging a 3 year old video using it just to abuse me “bitch”?? uhuh.. won’t shy away from calling you.. because you started it.. but this is a bad me doing it.. but the person my parents raised me is still there so the ***
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 7, 2021