అనసూయ.. యాంకర్ అనే కంటే బుల్లితెర స్టార్ అనడం కరెక్ట్ ఏమో. రెండేళ్ల క్రితం వరకు కేవలం టీవీ షోకి పరిమితమైన అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచింది. ఇక ఇటీవల `పుష్ప`లో దాక్షాయణి పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది.
దీంతో పుష్ప మూవీ తర్వాత ఇతర భాషల నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అనసూయకు రీసెంట్ గా బాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
బీ టౌన్ కు చెందిన స్టార్ హీరో త్వరలో చేయబోయే ఓ పాన్ ఇండియా మూవీ లో ఈ ముద్దుగుమ్మకు ఓ కీ రోల్ దక్కిన్నట్టుగా తెలుస్తోంది. అయితే తెలుగు వర్షన్ సంబంధించి మాత్రమే ఆమె పాత్ర ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఈ పాత్రకు గాను ఆమెకు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అనసూయ తెలుగులో ఆచార్య, ఖిలాడి, రంగమార్తాండ సినిమాల్లో నటిస్తోంది. ఇక తమిళంలో ఫ్లాష్‌బ్యాక్`తోపాటు విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తోంది. అటు మలయాళంలోనూ మమ్ముట్టితో భీష్మ పర్వం` చిత్రంతో బిజీగా ఉంది.