టీవీ యాంకర్, సినీ నటి అనసూయ పెద్దాపురంలో సందడి చేసింది. పట్టణంలో ఓ షోరూం ప్రారంభించడానికి వచ్చింది అనసూయ. ఈ సందర్భంగా ఆమె ఊహించని బహుమతి ఒకటి అందుకుంది.
కాకినాడలోని ఓ హోటల్ లో దిగిన అనసూయకు సురుచి సంస్థ, బాహుబలి కాజాను అందించింది. సాధారణంగా కాజా ఏ సైజులో ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ అనసూయ అందుకున్న కాజాను మాత్రం రెండు చేతులతో పట్టుకోవాల్సి ఉంటుంది. అంత పెద్ద కాజా ఇది.
తమ పట్టణానికి ఓ సెలబ్రిటీ వచ్చినా, ఇలా బాహుబలి కాజా అందించి స్వాగతం పలుకుతామని తెలిపింది సురుచి సంస్థ. ఇందులో భాగంగా అనసూయకు కూడా బాహుబలి కాజా అందింది.
ప్రస్తుతం అనసూయ సినిమాల సంఖ్య పెంచింది. ఆమె నటించిన ఓ ఆంధాలజీ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. దీంతోపాటు పుష్ప-2 షూటింగ్ కోసం ఆమె ఎదురుచూస్తోంది.