సెలబ్రిటీలకు సహజంగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉంటారు. అలాగే వారిని ద్వేషించే వారు కూడా ఉంటారు. ఇక యాంకర్, నటి అనసూయ విషయానికి వస్తే ఆమెకు అభిమానుల కన్నా ఆమెను ద్వేషించే వారే ఎక్కువగా ఉంటారేమో. ఎందుకంటే ఆమెను చాలా మంది ట్రోల్ చేస్తూ తీవ్రంగా దూషిస్తుంటారు. ఆమె వేసుకునే దుస్తులపై అసభ్యకర కామెంట్లు చేస్తుంటారు. అయినప్పటికీ ఇవన్నీ వారికి మామూలే. వారు అంతగా పట్టించుకోరు. అయితే ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు మాత్రం అనసూయ స్పందించకుండా ఉండలేకపోయింది. అతనికి ఘాటు రిప్లై ఇచ్చింది.
అప్పట్లో ఓ టీవీ షో కోసం అనసూయ షూటింగ్ చేసింది. అందులో భాగంగా ఆమె సెట్‌లో కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆ వీడియోకు చెందిన స్క్రీన్‌షాట్‌ను తీసిన ఓ నెటిజన్ ఆమెకు ట్విట్టర్‌లో అసభ్యకరమైన కామెంట్ పెట్టాడు. అనసూయ అందరి అటెన్షన్ పొందాలని ఇలా చేస్తుందని ఘాటుగా విమర్శించాడు. అయితే అందుకు అనసూయ గట్టి రిప్లై ఇచ్చింది. ఆ నెటిజన్ పోస్టును ఆమె రీట్వీట్ చేసింది.
Its easy to comment isn’t it? Having punched out two babies and in the process developed low blood pressure and this particular “attention seeking” incident took place at 5:30am where we shot straight for 22 hours.. what exactly do you know to even notice Mr.Aditya..?? https://t.co/FyrR4CW9Ou
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 7, 2021
కామెంట్లు చేయడం చాలా సులభమే. కానీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక లో బీపీ వచ్చింది. అందులోనూ ఆ రోజు ఏకబిగిన 22 గంటల పాటు షూటింగ్ చేశాం. అప్పుడు సమయం 5.30 అవుతోంది. అందువల్ల అనారోగ్యంతో స్పృహ తప్పిపోయా. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు కామెంట్ చేస్తావు ? అంటూ అనసూయ ఆ నెటిజన్‌ను ప్రశ్నించింది.
Now you my dear are an Attention seeking B*****d digging a 3 year old video using it just to abuse me “bitch”?? uhuh.. won’t shy away from calling you.. because you started it.. but this is a bad me doing it.. but the person my parents raised me is still there so the ***
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 7, 2021
3 ఏళ్ల కిందటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి నన్ను దూషిస్తున్నావు, నీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడను, నువ్వు ఇది స్టార్ట్ చేశావు, కానీ నీకు రిప్లై ఇస్తున్నందుకు అవమానంగా ఉంది. అయినప్పటికీ నిన్ను నేను ఏమీ అనను, ఎందుకంటే నీలా నన్ను నా తల్లిదండ్రులు పెంచలేదు.. అని అనసూయ ఇంకో కౌంటర్ ఇచ్చింది. కాగా అనసూయకు ఈ విషయంలో ఆమె అభిమానులు అండగా నిలిచారు. మీరు కరెక్టే చేశారు.. అంటూ రిప్లై ఇస్తున్నారు.