సునీల్…ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కమెడియన్ గా దశాబ్దకాలంపాటు టాప్ లెవెల్ లో కెరీర్ ను కొనసాగించారు. అయితే అందాల రాముడు సినిమా తో హీరో గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా తో మంచి హిట్ కొట్టాడు. ఈ రెండు మినహాయిస్తే ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అయితే కొట్టలేకపోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. అయినప్పటికీ హీరోగా అడపాదడపా సినిమాలు వస్తున్నాయి.
తాజాగా సి చంద్రమోహన్ దర్శకత్వంలో సునీల్ సినిమా చేయబోతున్నాడు. దీనికి వేదాంతం రాఘవయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సునీల్ సరసన జబర్దస్త్ యాంకర్ అనసూయ నటించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే అనసూయ ను చిత్రయూనిట్ సంప్రదించిందట. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. ఇక అనసూయ ఓకే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.