జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అనసూయ. తన అందంతో అభినయంతో బుల్లితెర నుంచి వెండితెర వరకు రాగలిగింది. ఓవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే మరోవైపు వెండితెరపై వరుస సినిమాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలపై స్పందిస్తూ ఉంటారు. అదేవిధంగాట్రోల్స్ కి కూడా గురవుతుంటారు.
ఇక నేడు ఉమెన్స్ డే సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కొంతమంది ట్రోలర్స్ ని టార్గెట్ గా పెట్టుకుని అనసూయ ఈ ట్వీట్ చేసింది.
ఓ! ప్రతి ట్రోలర్ మరియు మీమ్ మేకర్ హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించే రోజు. ఇది 24 గంటల్లో ముగుస్తుంది! హ్యాపీ ఫూల్స్ డే అంటూ పేర్కొంది అనసూయ. ఇక అనసూయ ట్వీట్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
మీ బిహేవియర్ బట్టే మీకు ఇచ్చే గౌరవం ఉంటుందని…థెరిస్సా, కల్పనా చావ్లా, కిరణ్ బేడీలపై ఎందుకు ట్రోల్స్ జరగలేదు. ఎక్కడివరకు ఎందుకు యాంకర్ సుమపై ఎందుకు ట్రోల్స్ జరగటం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి అనసూయ దీనికి ఎలాంటి రిప్లయ్ ఇస్తుందో చూడాలి.
Annnddd!! Thank me later!! You will see all those “gummadikaya dongalu” commenting below my tweet!! Have a good one y’all!! 😉
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022
Advertisements