అనసూయ అత్యుత్సాహంతో అసలే పదవి లేక దిగులుపడ్డ జోగు రామన్నకు పుండు మీద కారం చల్లింది. ఆంధ్ర, తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాల వల్ల ప్రకృతి నాశనం అవుతుందని అనసూయ ట్వీట్ ద్వారా ఆందోళన వ్యక్తంచేసింది.
సహజసిద్ధమైన, ఆహ్లాదకరమైన చల్లగాలి ప్రసాదించే చెట్లను చంపి ప్రాణాంతక కాలుష్యాన్ని పీల్చడానికి ఎలా అనుమతిస్తున్నారు సార్ ? ఇదంతా ఆలోచించడానికి భయం వేయడం లేదా? అంటూ అనసూయ ట్విట్టర్లో మంత్రుల్ని ప్రశ్నించాలనుకుంది. ప్రశ్నించింది కూడా. కాకపోతే, ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కేంద్ర అటవీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఫోటోలతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నఫోటోని కూడా తన ట్వీట్‌లో అనసూయ ట్యాగ్ చేసింది. జోగు రామన్నని అటవీ మంత్రి అనుకొని ఆయన ఫోటోను ట్వీట్ చేసింది అనసూయత్త. అసలే పదవి రాక వివాదంతోపాటు ఆత్మ క్షోభలో ఉన్న జోగు రామన్నకు ఇది మరింత బాధించింది. తర్వాత అసలు తప్పు తెలుసుకున్న అనసూయ క్షమాపణలు కోరింది. తగుదునమ్మా అంటూ వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్లు మీద ట్వీట్లు ఇస్తే ఇలాగే సీన్ రివర్సవుతుంది. అనసూయ గారు ట్వీట్ చేయాలంటే కాసింత కరెంట్ అఫైర్స్ తెలిసుండాలండీ..!! నెటిజన్లు మాత్రం కేసీఆర్ ఇవ్వకపోయినా అనసూయత్త రామన్నకు మంత్రిపదవి ఇచ్చేసిందని సెటైర్లు వేస్తున్నారు.