తన అందంతో, అభినయంతో బుల్లితెర పై మెరిసే యాంకర్ అనసూయ. తన చలాకీతనంతో బుల్లితెర నుంచి వెండితెర వరకు పయనిస్తున్న అనసూయ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది. పొట్టి పొట్టి డ్రెస్ లతో యూత్ ని మైమరిపించే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు గట్టిగానే ఉన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇక విజయదేవరకొండ నిర్మించబోయే ఓ సినిమాలో అనసూయ లేడీ విలన్ గా నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనసూయ విలన్ గా నటించటం ఏంటని నెటిజన్లు కూడా తెగ చర్చించుకుంటున్నారు. మరి అనసూయ నిజంగా విలన్ గా నటించనుందా లేదా అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
ప్రస్తుతం అనసూయ సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు టీవీ షోలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.