బుల్లితెర పై అనసూయ పేరు తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు.. జబర్దస్త్ షోతో బుల్లితెర పై అడుగుపెట్టిన అనసూయ ఒకవైపు షో లు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ తన టాలెంట్ చూపిస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోటంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అనసూయ కూడా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది. అయితే ఓ నెటిజన్ సోషల్ మీడియా లో అడిగిన ప్రశ్నకు ఫైర్ అయ్యింది అనసూయ. ఓ పార్టీ లో తరుణ్ భాస్కర్ మీరు రచ్చ రచ్చ చేశారట నిజమేనా అంటూ అడిగాడు.
దానికి సమాధానం ఇస్తూ అట అనే మాటని మీరే సరదాగా తీసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చింది. నిజాలు వేరే ఉంటాయని… వాటిని తెలుసుకోవాలంటే మీరు ఇంకా పరిణితి చెందాలని సమాధానం ఇచ్చింది. మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్తూ…నానమ్మ పేరు నాకు పెట్టారని, మా నానమ్మ పేరు అనసూయ అని నా స్వగ్రామం నల్గొండ అని… మా ఇంటి పేరు కస్బా అంటూ చెప్పుకొచ్చింది.