అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర పై జబర్దస్త్ షో తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందచందాలతో బుల్లితెర నుంచి వెండివరకు వచ్చింది. వెండితెర పై ఎన్నో వినూత్న పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తాజా మరాఠి రీమేక్ సినిమా రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయ నటిస్తుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ కనిపించనుంది. అయితే ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో అనసూయ కనిపించనుంది. మరి ఈ సినిమాతో అనసూయ ఏమేర ఆకట్టుకుందో చూడాలి. ఈ సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస అవకాశాలతో మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే.