జబర్ధస్త్ షో నుండి నాగబాబుతో పాటు హైపర్ ఆది, అనసూయ కూడా వెళ్లిపోయారు. ఇంకెంత మంది వెళ్లిపోతారో తెలియదు. ఇది వార్త. ఊహాగానాలో… నిజమైన వార్తలో అన్న సందిగ్ధం ఉన్నా… నాగబాబు ఎగ్జిట్‌తో అంతా అనుమానంగానే ఉన్నారు. కామెడీ షోలకే కింగ్ అయిపోయిన జబర్ధస్త్ క్రేజ్ అలాంటిది మరీ.
అయితే, జబర్ధస్త్ ఫ్యూచర్‌పై టీం లీడర్ అదిరే అభి ఓ క్లారిటీ ఇచ్చాడు. జబర్ధస్త్ తమందరికీ అన్నం పెట్టి ఆదుకుందని, ఒకరిద్దరు వెళ్లినంత మాత్రాన జబర్ధస్త్ ఆగిపోదని… అదే జోష్‌తో టీఆర్పీని కంటిన్యూ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయటకు వెళ్లిన వారికి వ్యక్తిగత కారణాలు ఉంటే ఉండొచ్చని… నాగబాబులాంటి వారిపై కామెంట్ చేసే స్థాయి నాది కాదన్నారు.
ఇక జబర్ధస్త్ ఫ్యూచర్‌పై క్లారిటీ ఇస్తూ… అంతా అనుకుంటున్నట్లు యాంకర్ అనసూయ, హైపర్ ఆదిలు ఎక్కడికీ వెళ్లిపోలేదని… వారిద్దరు జబర్ధస్త్‌తోనే కంటిన్యూ అవుతున్నారని తెలిపారు.
అయితే, ఒకరిద్దరు వెళ్లిపోతున్నారని ఒప్పుకున్న అదిరే అభి… నాగబాబు కాకుండా వెళ్లిపోయే మరోకరు ఎవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఒకరు ఎవరనేది ఒకటి రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.